బెంగళూరులో మస్క్ ఫొటోకు పూజలు.. కారణం ఇదే
- గతేడాది ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్
- పురుషుల బాధను చెప్పుకునేందుకు ట్విట్టర్లో అవకాశం ఇచ్చిన మస్క్
- కృతజ్ఞతతో మస్క్ ఫొటోకు పూజలు చేసిన సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫెడరేషన్
బెంగళూరుకు చెందిన సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫెడరేషన్ అనే సంస్థ ఈ పని చేసి వార్తల్లో నిలిచింది. పురుషుల బాధల్ని చెప్పుకునేందుకు ట్విట్టర్లో అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతగా ఆ సంస్థ ప్రతినిధులు మస్క్ పై అభిమానం చాటుకున్నారు. బెంగళూరులోని ఫ్రీడం పార్కులో మస్క్ ఫ్లెక్సీకి ప్రత్యేక పూజలు చేశారు. ఫ్లెక్సీలో స్త్రీవాదులను అంతం చేసేవారు (డిస్ట్రాయర్ ఆఫ్ వొకాషురా), మెన్స్ లైవ్స్ మ్యాటర్ అనే ట్యాగ్‌లైన్ కూడా ముద్రించారు.