ఏపీ ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల విడుదల.. ఇలా చెక్ చేసుకోండి!
- 411 ఎస్ఐ పోస్టులకు ఫిబ్రవరి 19న పరీక్ష
- ప్రిలిమినరీలో 57,923 మంది ఎంపిక
- వీరిలో మహిళలు 8,537 మంది
411 ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి దాదాపు 291 పరీక్ష కేంద్రాల్లో ప్రిలిమినరీ రాత పరీక్షను నిర్వహించారు. 1,51,288 మంది అభ్యర్ధులు హాజరు కాగా, 57,923 మంది ఎంపికయ్యారు. వీరిలో పురుషులు 49,386 మంది, మహిళలు 8,537 మంది ఉన్నారు.
పరీక్ష తర్వాత రోజున ప్రైమరీ ఆన్సర్ ‘కీ’ విడుదల చేశారు. దీనిపై పేపర్ -1కు దాదాపు 1,553 అభ్యంతరాలు బోర్డుకు అందాయి. వాటిని నిపుణులు పరిశీలించినా.. ఆన్సర్ ‘కీ’లో ఎలాంటి మార్పులు చేయలేదని బోర్డు వెల్లడించింది. రెండో పేపర్‌లో ఒక ప్రశ్నకు ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉన్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకొని మార్కులు కేటాయించారు.
రెండు పేపర్లలో అర్హత సాధించిన వారికి ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నారు. అందులో అర్హత సాధించిన వారికి మెయిన్స్ నిర్వహిస్తారు. మార్చి 4వ తేదీ ఉదయం నుంచి స్కాన్ చేసిన ఓఎంఆర్ షీట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని బోర్డు తెలిపింది. ఇతర అప్‌డేట్ల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేసుకోవాలని సూచించింది.
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి