28 కి.మీ దూరానికి హెలికాప్టర్ ప్రయాణమా?: నాదెండ్ల
- తాడేపల్లి నుంచి తెనాలికి హెలికాప్టర్ లో ప్రయాణించడంపై జనసేన నేత విమర్శలు
- ఆ మాత్రం దూరం కూడా రోడ్డు మార్గంలో వెళ్లలేరా అంటూ ప్రశ్నించిన నాదెండ్ల మనోహర్
- ప్రజలను గతుకు రోడ్ల పాల్జేసి జగన్ మాత్రం హెలికాప్టర్ లో తిరుగుతున్నరని విమర్శ
హెలికాప్టర్ కు పెట్టే డబ్బులతో రోడ్లు బాగుచేయించవచ్చని తెలిపారు. ప్రజలను గతుకుల రోడ్ల పాల్జేసిన జగన్.. తను మాత్రం హెలికాప్టర్ లో తిరుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, సీఎం జగన్ తెనాలి పర్యటన సందర్భంగా ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడమేంటని నాదెండ్ల పోలీసులను నిలదీశారు. ప్రజలన్నా, ప్రశ్నించే ప్రతిపక్ష నేతలన్నా సీఎం జగన్ కు భయమని చెప్పారు. అందుకే ప్రతిపక్షాలకు చెందిన నేతలను అరెస్టు చేయిస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం పర్యటన సందర్భంగా తెనాలిలో కర్ఫ్యూ వాతావరణం సృష్టించారని నాదెండ్ల మనోహర్ పోలీసులపై విమర్శలు గుప్పించారు.