Telangana: కొవిడ్ ఇంకా పోలేదు.. తెలంగాణలో ఏడు కొత్త కేసులు

Telangana clocks 7 new cases of Covid
  • రాష్ట్రవ్యాప్తంగా 2,700 మందికి పరీక్షలు
  • కొత్తగా 7 పాజిటివ్ కేసులు
  • మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 82
కరోనా ఖతం అయిపోయింది..? ఇప్పుడు చాలా మందిలో ఉన్న అభిప్రాయం ఇది. కొత్త కేసుల వార్తలు పెద్దగా ప్రచారం కాకపోవడంతో కరోనా పోయిందని అనుకుంటున్నారు. కానీ, ఇది నిజం కాదు. తెలంగాణలో ఇప్పటికీ కరోనా కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.

ఆదివారం తెలంగాణలో కొత్తగా ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,700 మందికి పరీక్షలు నిర్వహించగా, ఏడు కేసులు బయటపడ్డాయి. దీంతో ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పాజిటివ్ కేసుల సంఖ్య 82కు చేరుకుంది. గతంలో కరోనా బారిన పడిన రోగుల్లో నలుగురు కోలుకున్నారు. 

హైదరాబాద్ జిల్లాలో నాలుగు కొత్త కేసులు బయటపడగా, అదే రోజు కొత్తగా 84 మంది కరోనా నివారణ టీకాలు ఇచ్చినట్టు వైద్య ఆరోగ్య శాఖ డేటా తెలియజేస్తోంది. కరోనాతో కొత్తగా మరణాలు ఏవీ నమోదు కాలేదు. రికవరీ రేటు రాష్ట్రవ్యాప్తంగా 99.50 శాతంగా ఉంది.
Telangana
corona
covid-19
new cases

More Telugu News