Jasprit Bumrah: ముంబై ఇండియన్స్ కు పెద్ద దెబ్బ.. స్టార్ పేసర్ ఔట్!

  • గాయంతో ఎన్ సీఏలో రిహాబిలిటేషన్ లో ఉన్న జస్పీత్ బుమ్రా
  • మానని గాయం.. ఈ ఐపీఎల్ సీజన్ కు పూర్తిగా దూరం?
  • ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కు అందుబాటులో ఉండటమూ కష్టమే
Blow for MI Bumrah may miss IPL 2023

టీమిండియా స్టార్ పేసర్ జస్పీత్ బుమ్రా.. గాయాలతో ఆరు నెలలుగా క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు. ప్రతిష్ఠాత్మక బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలోనూ ఆడటం లేదు. ఐపీఎల్ కోసమే ఉద్దేశపూర్వకంగా అతడికి విశ్రాంతి ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. అయితే ఇందులో నిజం లేదని, బుమ్రాకు అయిన గాయం తీవ్రమైనదని తెలుస్తోంది. ఐపీఎల్ కు కూడా బుమ్రా అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం.

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ టీమ్ కు బుమ్రా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తన పదునైన యార్కర్లతో ఎన్నో సార్లు ముంబై జట్టును గెలిపించాడు. ఇప్పుడు అతడి గైర్హాజరీ టీమ్ కు పెద్ద దెబ్బే. ఈ నేపథ్యంలో అతడికి ప్రత్యామ్నాయాన్ని వెతికే పనిలో టీమ్ మేనేజ్ మెంట్ ఉంది. 

ప్రస్తుతం ఎన్ సీఏలో రిహాబిలిటేషన్ లో బుమ్రా ఉన్నాడు. గాయం నుంచి కోలుకుని, ఫిట్ నెస్ సాధించేందుకు శ్రమిస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్ కాకున్నా.. తర్వాత మొదలయ్యే వన్డే సిరీస్ కు బుమ్రా అందుబాటులో ఉంటాడని తొలుత ప్రచారం జరిగింది. కానీ జూన్ లో జరగబోయే ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కు అందుబాటులో ఉండటం కష్టమేనని తెలుస్తోంది. సెప్టెంబర్ లో జరిగే ఆసియా కప్ నాటికి బుమ్రా ఫిట్ గా ఉండే అవకాశం ఉందని బీసీసీఐ అంచనా వేస్తోంది.

More Telugu News