Nara Lokesh: చిన్నారులకు చాక్లెట్లు, పుస్తకాలు కానుకగా ఇస్తున్న నారా లోకేశ్

Lokesh gifts children chocolates and books in Padayatra
  • గత నాలుగు వారాలుగా లోకేశ్ యువగళం
  • ప్రస్తుతం తిరుపతి నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్ర
  • చిన్నారులను ఆకట్టుకుంటున్న లోకేశ్
టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ చేపడుతున్న యువగళం పాదయాత్ర ప్రస్తుతం తిరుపతి నియోజకవర్గంలో కొనసాగుతోంది. గత నాలుగు వారాలుగా సాగుతున్న పాదయాత్రలో లోకేశ్ వివిధ వర్గాలను కలుస్తూ ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా, లోకేశ్ చిన్నపిల్లలతో మమేకం అవుతూ, వారిని నవ్విస్తూ, కానుకలు ఇస్తూ ఆకట్టుకుంటున్నారు. 

తన పాదయాత్రలో ఎక్కడ చిన్నారులు కనిపించినా, ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని, వారికి చాక్లెట్లు, పుస్తకాలు, పెన్నులు ఇస్తున్నారు. వారితో ఆటలాడుతూ ఉల్లాసంగా గడుపుతున్నారు.  దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.
Nara Lokesh
Gifts
Children
Yuva Galam Padayatra
TDP

More Telugu News