Advertisement

గన్నవరం టీడీపీ కార్యాలయంపై ప్రభుత్వమే దాడి చేయించింది: వర్ల రామయ్య

Varla Ramaiah visits TDP office in Gannavaram
  • గన్నవరం వచ్చిన వర్ల రామయ్య
  • టీడీపీ ఆఫీసు పరిశీలన
  • ఇటీవల టీడీపీ ఆఫీసుపై దాడి
  • ప్రభుత్వమే దాడి చేయించిందన్న వర్ల రామయ్య
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నేడు గన్నవరం వచ్చారు. ఇటీవల దాడికి గురైన టీడీపీ కార్యాలయాన్ని పరిశీలించారు. గన్నవరంలో టీడీపీ ఆఫీసుపై ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా దాడి చేయించిందని వర్ల రామయ్య ఆరోపించారు. దాడి చేస్తారని ఎస్పీ, ఇతర పోలీసు అధికారులకు ముందే తెలుసని అన్నారు. పోస్టింగ్ ఇవ్వరన్న భయంతోనే ఎస్పీ అన్ని విషయాలు దాచిపెడుతున్నారని పేర్కొన్నారు. 

ఎవరెన్ని ఎత్తులు వేసినా వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకాలు, అవినీతితోనే వైసీపీ పాలన సాగుతోందని వర్ల రామయ్య విమర్శించారు.
Advertisement
Varla Ramaiah
TDP Office
Gannavaram
Police
YSRCP
Andhra Pradesh

More Telugu News