Nikki Haley: జోబైడెన్ కంటే భారత సంతతి రిపబ్లికన్ నిక్కీ హేలీకే అమెరికన్ల మొగ్గు 

Indian origin Nikki Haley favoured over Biden trails Trump in US prez race Survey
  • రాస్ ముసెన్ రిపోర్ట్స్ నేషనల్ టెలిఫోన్ అండ్ ఆన్ లైన్ సర్వే
  • హేలీకి  45 శాతం అమెరికన్ల మద్దతు
  • బైడెన్ కు 41 శాతం మంది అనుకూలం
  • డొనాల్డ్ ట్రంప్ కు 52 శాతం మద్దతు
భారత సంతతి మహిళ, రిపబ్లికన్ నేత, దక్షిణ కరోలినా రాష్ట్రానికి రెండు పర్యాయాలు గవర్నర్ గా పనిచేసిన నిక్కీ హేలీ వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గట్టి ప్రభావమే చూపించనున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల బరిలో ఉంటానని నిక్కీ హేలీ ఇటీవలే ప్రకటించడం గమనార్హం. దీంతో ఆమెకు ప్రజల్లో ఏ పాటి మద్దతు ఉందో తెలుసుకుందామని చెప్పి, ఓపీనియన్ పోల్ నిర్వహించారు. 

రాస్ ముసెన్ రిపోర్ట్స్ నేషనల్ టెలిఫోన్ అండ్ ఆన్ లైన్ సర్వేలో.. 51 ఏళ్ల నిక్కీ హేలీ ఆశ్చర్యకరంగా డెమొక్రటిక్ పార్టీ నేత, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కంటే ముందున్నారు. 45 శాతం మంది అమెరికన్లు హేలీకి ఓటు వేస్తామని చెప్పగా, 41 శాతం మంది బైడెన్ కు ఓటు వేస్తామని తెలిపారు. ఇతరులకు అని చెప్పిన వారు 10 శాతంగా ఉన్నారు. ప్రత్యర్థి పార్టీకి చెందిన బైడెన్ కంటే ముందున్న హేలీ.. సొంత పార్టీకి చెందిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే వెనుకబడ్డారు. ట్రంప్ కు ఓటు వేస్తామని చెప్పిన వారు 52 శాతంగా ఉన్నారు. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెసాంటిస్ కు 24 శాతం మంది ఓటు వేస్తామన్నారు. అంటే ఇప్పటికీ ట్రంప్ ప్రభావం బలంగానే ఉన్నట్టు తెలుస్తోంది.

తన సొంత పార్టీకి బయట.. 18 శాతం డెమోక్రాట్లు నిక్కీ హేలీకి మద్దతు తెలుపుతున్నారు. ట్రంప్ కు 74 శాతం డెమోక్రాట్ల మద్దతు ఉంది. తదుపరి అమెరికా అధ్యక్ష ఎన్నిక 2024 నవంబర్ 5న జరగనుంది. అధ్యక్ష బరిలోకి దిగాలంటే ముందు రిపబ్లిక్ పార్టీ తరఫున అభ్యర్థిగా గెలవాల్సి ఉంటుంది. అది వచ్చే ఏడాది జనవరిలో మొదలవుతుంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తిరిగి మరోసారి అధ్యక్ష బరిలోకి దిగుతానని ఇంకా ప్రకటించలేదు. ఒకవేళ నిక్కీ హేలీ విజయం సాధిస్తే అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలు అవుతారు.
Nikki Haley
most favoured
prez race Survey

More Telugu News