China: జనాభా తగ్గిపోతుండడంతో చైనా ప్రభుత్వ కీలక నిర్ణయం

  • 1980 నుంచి 2015 వరకు చైనాలో ఒక్కటే బిడ్డ విధానం
  • గణనీయంగా పడిపోతున్న జననాల రేటు
  • కొత్త జంటలకు వేతనంతో కూడిన నెల రోజుల సెలవు
  • పిల్లలను కనేందుకు ప్రోత్సాహం
China takes key decision to raise population

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగివున్న దేశం చైనా. చైనాలో 145 కోట్ల మంది జనాభా ఉంది. అయితే చైనా ప్రభుత్వానికి ఈ జనాభా సరిపోవడంలేదట. ఇటీవల జనాభా రేటు తగ్గుతోందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ఒరవడి ఇలాగే కొనసాగితే దీర్ఘకాలంలో దేశంలో మానవ వనరులకు కొరత ఏర్పడే ప్రమాదం ఉందని భావిస్తోంది. 

గతంలో జనాభా విపరీతంగా పెరిగిపోతుండడంతో... ఇద్దరు పిల్లలు వద్దు ఒక్కరే ముద్దు నినాదాన్ని తీసుకువచ్చిన, చైనా ఇప్పుడా నినాదాన్ని తొలగించి, పెద్ద సంఖ్యలో పిల్లలను కనేందుకు గేట్లు ఎత్తివేసింది. 

కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు ప్రోత్సాహకం ఒక నెల రోజుల పాటు సెలవులు మంజూరు చేస్తోంది. ఈ ప్రత్యేక సెలవులో వేతనం కూడా ఇస్తారు. దేశవ్యాప్తంగా జనాభా రేటు పెంపొందించుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. 

చైనాలో 1980 నుంచి 2015 వరకు అత్యంత కఠిన రీతిలో ఒక్కటే బిడ్డ విధానాన్ని అమలు చేశారు. దాంతో జనన రేటు భారీగా పడిపోయింది. దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగింది. అయితే ఇది చివరికి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే మార్పుగా పరిణమిస్తుందన్న నిపుణుల సూచనతో చైనా అప్రమత్తమైంది. దాంతో పిల్లలను కనేందుకు యువతను ప్రోత్సహిస్తోంది.

More Telugu News