Amarjeet Jaikar: బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సినిమాలో పాడనున్న ఇటుకబట్టీ కార్మికుడు!

Bollywood actor Sonu Sood offered Amarjeet Jaikar to sing in his film Fateh
  • బీహార్‌కు చెందిన అమర్‌జీత్ జైకర్‌ 
  • పాటలు పాడుతూ ట్విట్టర్‌లో వీడియోలో పోస్టు
  • ‘దిల్ దే దియా హై’ పాటకు పది లక్షలకు పైగా వీక్షణలు
  • సోనూ సూద్ సినిమా ‘ఫతే’ సినిమాలో పాడే అవకాశం
ఎవరికి ఎప్పుడు ఎటువైపు నుంచి అదృష్టం తన్నుకొస్తుందో తెలియదు. బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన అమర్‌జీత్ జైకర్‌కు కూడా ఇలానే కలలో కూడా ఊహించని అదృష్టం వచ్చి తలుపు తట్టింది. ఇటుకబట్టీ కార్మికుడైన అమర్‌జీత్‌కు పాటలు పాడడమంటే ఎంతో ఇష్టం. బాలీవుడ్ పాటలు పాడుతూ వాటిని ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ ఉంటాడు. ఇటీవల ‘దిల్ దే దియా హై’ పాట పాడి ఆ వీడియోను ట్విట్టర్‌లో  పోస్టు చేశాడు. 

ఈ వీడియో ట్విట్టర్‌ను కుదిపేసింది. దానిని 10 లక్షల మందికిపైగా వీక్షించారు. ఈ వీడియోను చూసిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్, నటి నీతూ చంద్ర, ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ సహా పలువురు ప్రముఖులు అమర్‌జీత్‌ను ప్రశంసిస్తూ వీడియోను రీ ట్వీట్ చేశారు. అంతేకాదు,  సోనూ సూద్, నీతూచంద్ర అతడి ఫోన్ నంబరు తీసుకుని మాట్లాడారు.

సోనూసూద్ ప్రస్తుతం నటిస్తున్న ‘ఫతే’ చిత్రంలో అతడికి పాడే అవకాశాన్ని కూడా కల్పించారు. బాలీవుడ్ నుంచి పిలుపు రావడంతో అమర్‌జీత్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సోనూ సూద్ తనకు ఫోన్ చేసిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్న అమర్‌జీత్ మీ ప్రేమాభిమానాలు తనకు ఇలాగే ఉండాలని కోరుకున్నాడు.
Amarjeet Jaikar
Bollywood
Bihar
Sonu Sood

More Telugu News