Mantena Sathyanarayanaraju: కొడాలి నానిపై విరుచుకుపడిన టీడీపీ ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు

TDP MLC Sathyanarayanraju slams Kodali Nani
  • కొట్టుకుందాం రా అంటూ చంద్రబాబుకు కొడాలి నాని సవాల్
  • కొడాలి నాని ఇంకా ఫ్రస్ట్రేషన్ లోనే ఉన్నాడన్న మంతెన
  • నానికి పిచ్చి ముదిరిందని కామెంట్ 
  • టీడీపీ అధికారంలోకి వచ్చాక ట్రీట్ మెంట్ ఇస్తామని వ్యాఖ్యలు
నేను, వంశీ రెడీ... ఎక్కడ కొట్టుకుందామో చెప్పు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు వైసీపీ నేత కొడాలి నాని సవాల్ విసరడం తెలిసిందే. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు స్పందించారు. తెలంగాణలో వీధి కుక్కలకు, ఏపీలో వైసీపీ నేతలకు తేడా ఏమీ లేదని సెటైర్ వేశారు. కొడాలి నానికి మంత్రి పదవి పోయిందన్న అసహనం ఇంకా తొలగిపోలేదని అన్నారు.

కొడాలి నానికి పిచ్చి బాగా ముదిరిందని వ్యాఖ్యానించారు. టీడీపీ అధికారంలోకి రాగానే కొడాలి నాని పిచ్చికి ట్రీట్ మెంట్ ఇస్తామని అన్నారు. కొడాలి నానిని గుడివాడ ప్రజలు ఎప్పుడో మర్చిపోయారని సత్యనారాయణరాజు వ్యాఖ్యానించారు.
Mantena Sathyanarayanaraju
Kodali Nani
Chandrababu
TDP
YSRCP

More Telugu News