Nani: చిన్నప్పుడు సినిమా పిచ్చితో మా నాన్న ఏం చేశాడంటే ..!: 'నిజం' టాక్ షోలో నాని

Nijam Talk Show
  • 'నిజం' వేదికపై తండ్రి గురించి ప్రస్తావించిన నాని
  • అప్పట్లో ఆయన మద్రాసుకి పారిపోయాడని వెల్లడి 
  • రెండు రోజులు 'విజయవాహిని' గేటు దగ్గరే నిలబడ్డాడని వివరణ 
  • నాగిరెడ్డి కూతురు ఆదరించిందన్న నాని

'సోని లివ్'లో 'నిజం' టాక్ షోకి సంబంధించిన 3వ ఎపిసోడ్ ను 'రానా - నానితో చేశారు. ఈ ఎపిసోడ్ లో నాని.. రానా ఇద్దరూ కూడా కెరియర్ పరంగా తమకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. నాని మాట్లాడుతూ .. "నేను తెరపై కనిపించాలని మా అమ్మకి ఉండేది. ఆమె సంతోషం కోసమైనా ఒక సినిమాలోనైనా కనిపించాలని అనుకున్నాను. అలా నా జర్నీ మొదలైంది" అన్నాడు. 

"నాకే కాదు .. మా నాన్నకి కూడా ఆయన చిన్నప్పుడు సినిమా పిచ్చి ఉండేది. ఆ పిచ్చితో ఆయన అప్పట్లో మద్రాసుకి పారిపోయాడు కూడా. ఆయన 'విజయవాహిని స్టూడియో' గేటు దగ్గర రెండు రోజుల పాటు నిలబడ్డారట. ఆయనను లోపలికి పంపించడం లేదు. ఆయనను నాగిరెడ్డి గారి కూతురు చూసింది. ఏ ఊరు అని అడిగితే .. వెనక్కి పంపిస్తారేమోనని ఆయన చెప్పలేదు. దాంతో తమతో పాటు నాన్నని వాళ్ల ఇంటికి తీసుకుని వెళ్లారు. 

అక్కడే ఆయన ఒక వారం రోజుల పాటు ఉన్నారు. ఈ వారం రోజుల పాటు ఆయనను బాగా చూసుకున్నారు. ఆ తరువాత ఆయనను మాటల్లో పెట్టి, ఎక్కడి నుంచి వచ్చావని అడిగితే చెప్పేశారు. అంతే .. అక్కడి నుంచి కబురు రావడం .. ఇక్కడి నుంచి మనుషులు వెళ్లి నాలుగు తగిలించి తీసుకు రావడం జరిగింది. మా ఇంట్లో అప్పటి నుంచి సినిమా పిచ్చి ఉంది. ఆయన యాక్టర్ కాలేకపోయాడు .. నేను అయ్యాను అంతే" అంటూ చెప్పుకొచ్చాడు. 

Nani
Rana Daggubati
Smita
Nijam

More Telugu News