Kanna Lakshminarayana: కాసేపట్లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్న కన్నా... బీజేపీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు

Kanna Lakshminarayan joining TDP today
  • 3 వేల మందితో టీడీపీలో చేరనున్న కన్నా
  • భారీ ర్యాలీతో టీడీపీ కార్యాలయానికి వెళ్లనున్న సీనియర్ నేత
  • కొందరు బీజేపీ నేతలు తనతో టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్య

ఏపీ సీనియర్ రాజకీయవేత్తల్లో ఒకరైన కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకోనున్నారు. ఈ మధ్యాహ్నం 2.48 గంటలకు 3 వేల మందితో టీడీపీలో చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు. 

టీడీపీలో చేరబోతున్న తరుణంలో కన్నా సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంత మంది బీజేపీ నేతలు తనతో టచ్ లో ఉన్నారని చెప్పారు. వారు కూడా టీడీపీలో చేరే అవకాశం ఉందనే కోణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు గుంటూరు లోని తన నివాసం నుంచి కన్నా లక్ష్మీనారాయణ భారీ ర్యాలీతో బయల్దేరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకోనున్నారు. అనంతరం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు.

  • Loading...

More Telugu News