Earthquake: 6.8 తీవ్రతతో తజికిస్థాన్‌లో భారీ భూకంపం

  • ఉదయం 5.37 గంటల సమయంలో భూకంపం
  • తీవ్రత 7.2గా పేర్కొన్న చైనా
  • చైనాకు 67 కిలోమీటర్ల దూరంలో భూమికి 20 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం
Huge Earthquake hits Tajikistan

మధ్య ఆసియా దేశమైన తజికిస్థాన్‌ను ఈ ఉదయం భారీ భూకంపం కుదిపేసింది. తెల్లవారుజామున 5.37 గంటలకు సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. గోర్నో-బదక్షన్ ప్రాంతంలో భూమికి 20.5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఆ తర్వాత 20 నిమిషాలకు 5.0 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది.

అయితే, ఈ భూకంపాల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించినట్టు సమాచారం లేదు. కాగా, చైనా మాత్రం తూర్పు తజికిస్థాన్‌లో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు చైనా పేర్కొంది. భూకంప కేంద్రం చైనా, ఆఫ్ఘనిస్థాన్‌లకు దాదాపు 67 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు తెలిపింది.

More Telugu News