M. Thippeswamy: సిరిమానుపై వేలాడుతూ గాల్లో తిరిగిన ఎమ్మెల్యే తిప్పేస్వామి

YCP MLA Thippeswamy Flying on Sirimanu in siddeswara swamy brahmotsavalu
  • హేమావతి గ్రామంలో హెంజేరు సిద్దేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
  • నాలుగో రోజైన నేడు ఘనంగా సిరిమానోత్సవం
  • సిరిమానుకు పూజలు చేసి కోరికలు నెరవేరాలంటూ సిరిమానుపై గాల్లో తిరిగిన ఎమ్మెల్యే
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామికి ఇంకా కొన్ని కోరికలు మిగిలి పోయినట్టున్నాయి. అవి నెరవేరాలంటూ సిరిమానుపై వేలాడుతూ గాల్లో తిరిగారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని అమరాపురం మండలం హేమావతి గ్రామంలో హెంజేరు సిద్దేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు అయిన నేడు సిరిమానోత్సవం నిర్వహించారు. 

 సిరిమానుపై వేలాడుతూ గాల్లో తిరిగితే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. ఈ నేపథ్యంలో సిరిమానోత్సవానికి హాజరైన తిప్పేస్వామి సిరిమానుకు పూజలు నిర్వహించారు. అనంతరం సిరిమానుకు కట్టిన తాడును పట్టుకుని గాల్లో చుట్టూ తిరిగారు.

M. Thippeswamy
Madakasira
YSRCP
Anantapur District

More Telugu News