దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది: బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు
- దేశంలో అన్ని సమస్యలు పెరిగిపోతున్నాయన్న తోట చంద్రశేఖర్
- కాంగ్రెస్ కొన్ని రాష్ట్రాలకే పరిమితమయిందని వ్యాఖ్య
- బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అన్న చంద్రశేేఖర్
రాష్ట్ర విభజనతో ఏపీకి కూడా ఎన్నో సమస్యలు తలెత్తాయని చంద్రశేఖర్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు తదితర విషయాలలో కేంద్రం చాలా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని, దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని... తెలంగాణ తరహాలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. స్వశక్తితో బీఆర్ఎస్ బలమైన పార్టీగా ఎదగడాన్ని వచ్చే ఎన్నికల్లో చూస్తారని చెప్పారు.