Gold price: వరుసగా రెండోరోజూ తగ్గిన బంగారం ధర

  • వారంలో ఏకంగా ఆరుసార్లు తగ్గిన ధర
  • 10 గ్రాముల బంగారంపై రూ.120 తగ్గుదల  
  • స్థిరంగా కొనసాగుతున్న వెండి ధర
24 carat gold price decreased in delhi mumbai chennai hyderabad

బంగారం ధరలు వారం రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం బంగారం ధరలో తగ్గుదల నమోదు కాగా వరుసగా రెండో రోజు బుధవారం కూడా ధర తగ్గింది. మొత్తంగా వారం రోజుల్లోనే ఆరుసార్లు ధరలు తగ్గాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో ధరల తగ్గుదల కనిపించింది. తాజాగా బుధవారం 10 గ్రాముల బంగారంపై రూ.120 తగ్గింది.

ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.52,150 ఉండగా, 24 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ.56,880 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.52,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.56,730 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.52,750 ఉండగా, 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.57,550 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.52,050, 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.56,780గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..
హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.52,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.56,730 ఉంది. కాగా, వెండి ధరల్లో మాత్రం మార్పు లేదు. ఢిల్లీ, ముంబైలలో కిలో వెండి ధర రూ. 68,500కాగా, బెంగళూరు, చెన్నైలో రూ.71,700 గా ఉంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 71,700 వద్ద కొనసాగుతోంది.

More Telugu News