Viral Videos: లో బడ్జెట్ సినిమా చిత్రీకరణ.. కొంచెం ఆసక్తిగా.. ఇంకొంచెం ఫన్నీగా వీడియో.. మీరూ చూసేయండి!

Video Showing Youngsters Making Low Budget Film Goes Viral
  • ఫోన్ తో షూటింగ్.. చెప్పులతో క్లాప్
  • కింద పడుకుని రికార్డింగ్
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
సినిమా తీయాలంటే.. రూ.కోట్లతో పని. నటులు, కెమెరాలు, పరికరాలు, సెట్టింగులు, వందల్లో పనివాళ్లు.. ఇంకెన్నో! మరీ అవతార్.. ఆర్ఆర్ఆర్ మాదిరి కాకున్నా.. ఓ మోస్తరు మూవీ తీయాలన్నా డబ్బులు తక్కువేమీ కావు. లో బడ్జెట్ సినిమా అనుకున్నా లక్షల్లోనే అవుతాయి. కానీ వీళ్ల కథ మాత్రం వేరు మరి. 

ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. కొందరు యువకులు చేస్తున్న ‘షూటింగ్’ కాస్త ఆసక్తిగానూ, ఇంకాస్త నవ్వు తెప్పించేదిగానూ ఉంది. వీడియో తీసేందుకు వాళ్లు ఉపయోగిస్తున్నవి రెండే రెండు.. ఒకటి సెల్ ఫోన్.. రెండు చెప్పులు!! అందుకే ఆ వీడియో వైరల్ అయి కూర్చుంది.

‘ది ఫిజెన్’ అనే యూజర్ ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘మీ సినిమా బడ్జెట్ 20 డాలర్లు అయినప్పుడు’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అందులో క్లాప్ కొట్టేందుకు ఓ యువకుడు చెప్పులను ఉపయోగించాడు. యాక్టర్ నడుచుకుంటూ వెళ్తుండగా.. కింద పడుకున్న ‘కెమెరా మ్యాన్’ ఫోన్ లో షూట్ చేశాడు. యాక్టర్ తో పాటు ‘కెమెరా’ మూవ్ అయ్యేందుకు కింద పడుకున్న కెమెరా మ్యాన్ ను ఇంకో యువకుడు అలా మెల్లగా ఈడ్చుకుంటూ వెళ్లాడు. 

ఆసక్తికరంగా ఉన్న ఈ వీడియోను కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కూడా లైక్ చేశారు. ఇప్పటిదాకా 3 లక్షల మందికి పైగా లైక్ కొట్టారు. ‘‘మీ దగ్గర ఏం ఉందన్నది కాదు.. ఉన్న దాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేది ముఖ్యం. అదే పనిలో గొప్పతనం’’ అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. ‘‘ఇది చాలా ఫన్నీగా ఉంది. వాళ్లు తీసే సినిమాను చూడాలని ఉంది’’ అని మరొకరు స్పందించారు. ‘‘ఇండియా క్రియేటివిటీ అంటే అదే మరి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ది’’ అని ఇంకొకరు కామెంట్ చేశారు.
Viral Videos
Youngsters Making Low Budget Film
slippers to start a scene
Andhra Pradesh

More Telugu News