Rajinikanth: సోదరుడు, ఆయన కుమారుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న రజనీకాంత్

Rajinikanth attends birthday bash of his brother
  • సోదరుడి కుటుంబాన్ని కలిసిన రజనీ
  • సోషల్ మీడియాలో ఫొటోలు పంచుకున్న వైనం
  • తాను ఈ స్థాయిలో ఉండడానికి సోదరుడే కారణమని వెల్లడి
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ తన కుటుంబంలో జరిగిన జన్మదిన వేడుకల గురించి స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. ఫొటోలను కూడా పంచుకున్నారు. తన సోదరుడు సత్యనారాయణరావు గైక్వాడ్ 80వ పుట్టినరోజు వేడుకలు, ఆయన కుమారుడు రామకృష్ణ 60వ పుట్టినరోజు వేడుకలు ఒకేసారి నిర్వహించామని రజనీకాంత్ వెల్లడించారు. ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారని తెలిపారు. 

తాను ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు తన సోదరుడే కారణమని, అలాంటి బంగారు హృదయం ఉన్న వ్యక్తిపై పసిడి వర్షం కురిపించడం అదృష్టంగా భావిస్తున్నానని, అందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని రజనీకాంత్ పేర్కొన్నారు.
Rajinikanth
Sathyanarayanarao
Ramakrishna
Birthday
Celebrations

More Telugu News