తారకరత్న భౌతికకాయానికి సోమవారం అంత్యక్రియలు
- కుప్పంలో గుండెపోటుకు గురైన తారకరత్న
- గత 23 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స
- పరిస్థితి విషమించి కన్నుమూత
సోమవారం ఉదయం ఆయన భౌతిక కాయాన్ని ఫిలిం చాంబర్‌కు తరలిస్తారు. అభిమానుల సందర్శనార్థం అక్కడ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంచుతారు. ఐదు గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.