Tarakaratna: అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం.. హైదరాబాద్ కు తరలించే అవకాశం?

Tarakaratna may be shifted to Hyderabad
  • తారకరత్నకు చికిత్స అందిస్తున్న విదేశీ వైద్యులు
  • ఆరోగ్యం విషమించినట్టు సమాచారం
  • కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతున్న డాక్టర్లు
సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కుప్పంలో యువగళం పాదయాత్ర సందర్భంగా గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు విదేశీ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. 

అయితే, ఆయన పరిస్థితి మెరుగు పడలేదని, అత్యంత విషమంగా ఉన్నట్టు నందమూరి కుటుంబానికి చెందిన సన్నిహితులు చెపుతున్నారు. బాలకృష్ణతో పాటు మరి కొందరు కుటుంబ సభ్యులు బెంగళూరుకు చేరుకున్నారు. వారితో వైద్యులు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. రేపు మధ్యాహ్నం తారకరత్నను హైదరాబాద్ కు తరలించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tarakaratna
Tollywood
Telugudesam
Health Condition

More Telugu News