రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలన్నీ చెల్లిస్తాం: నిర్మలా సీతారామన్
- నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
- పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
- ఐదేళ్ల కాలవ్యవధిలోని బకాయిల చెల్లింపునకు మార్గం సుగమం
- కేంద్రం నిధుల నుంచి చెల్లిస్తామని నిర్మల వెల్లడి
జూన్ మాసానికి సంబంధించిన రూ.16,982 కోట్లను కూడా చెల్లించేందుకు కేంద్రం నిర్ణయించిందని తెలిపారు. ఈ చెల్లింపులకు అవసరమైన నిధులు ప్రస్తుతం అందుబాటులో లేవని, కేంద్రం సొంత ఆర్థిక వనరుల నుంచి ఈ చెల్లింపులు చేస్తామని వివరించారు. ఇప్పుడు విడుదల చేసిన మొత్తాన్ని భవిష్యత్తులో పరిహార రుసుం వసూళ్ల నుంచి మినహాయించుకుంటామని నిర్మల చెప్పారు.