Errabelli: శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎర్రబెల్లి.. కారణం ఇదే!

Errabelli prayers to Lord Shiva for KCR
  • వేయిస్తంభాల గుడిలో పూజలు చేసిన ఎర్రబెల్లి
  • కేసీఆర్ ప్రధాని కావాలని ప్రార్థించానన్న మంత్రి
  • కేసీఆర్ పీఎం అయితే దేశ ముఖచిత్రం మారుతుందని ఆశాభావం

మహా శివరాత్రి సందర్భంగా పరమశివుడికి తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేయి స్తంభాల గుడిలోని రుద్రేశ్వరస్వామికి, పర్వతగిరిలోని పర్వతాల శివాలయంలోని శివుడికి పూజలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని కావాలనే కోరికతో ప్రత్యేక పూజలు నిర్వహించానని చెప్పారు.

కేసీఆర్ వచ్చిన తర్వాతే తెలంగాణలోని ఆలయాలకు మహర్దశ వచ్చిందని అన్నారు. వేములవాడ, కొండగట్టు, యాదాద్రి ఆలయాలను గత పాలకులు పట్టించుకోలేదని... ఆలయాల అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఆనాటి కాకతీయుల స్ఫూర్తితో కేసీఆర్ ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. వేయిస్తంభాల గుడి అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని కొనియాడారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని... ఆయన ప్రధాని అయితే మన దేశ ముఖచిత్రమే మారుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News