మీ చిన్నారులు చదువుల్లో దూసుకుపోవాలంటే.. ఇవి ఇవ్వండి!

  • పిల్లలకు కోడిగుడ్లు ఎంతో మంచివి
  • వీటితో చాలా పోషకాలు అందుతాయి
  • ఆకుపచ్చని కూరగాయలకు ప్రాధాన్యమివ్వాలి 
  • నట్స్, చేపలు కూడా ఇవ్వొచ్చు
Brain food important for your kids memory and sharpness

పిల్లలకు అన్ని రకాల పోషకాలు అవసరం. దీన్నే బ్యాలన్స్ డ్ ఫుడ్ అని అంటాం. అప్పుడే వారి మెదడు చాలా చురుగ్గా పనిచేయగలదు. వారిలో శారీరక, మానసిక వృద్ధి ఆరోగ్యకరంగా ఉంటుంది. ముఖ్యంగా చదువుకునే పిల్లలకు మెదడు చురుగ్గా పనిచేయాలి. అందుకని వారికి కావాల్సిన ముఖ్య పోషకాలపై తల్లిదండ్రులు దృష్టి సారించాలి. అప్పుడు పిల్లలు చదువుల్లో దూసుకుపోవడానికి కావాల్సిన శక్తి ఇచ్చిన వారు అవుతారు.

గుడ్లు
కోడి గుడ్డు నుంచి ఎన్నో పోషకాలు లభిస్తాయి. పిల్లలు గుడ్డును ఎంతో ఇష్టపడతారు కూడా. జ్ఞాపకశక్తిని, ఆలోచనా శక్తిని పెంచే పోషకాలు గుడ్డులో ఉన్నాయి. కొలిన్, విటమిన్ బీ12, ప్రొటీన్, సిలీనియం గుడ్డులో ఉంటాయి. కొలిన్ అనేది ముఖ్యమైన విటమిన్. మెదడు వృద్ధికి ఇది చాలా అవసరం. కనుక గుడ్డును పిల్లల ఆహారంలో భాగం చేయాలి.

పెరుగు
మెదడు చక్కని పనితీరుకు ఫ్యాట్ కూడా అవసరం. ప్రొటీన్ ఫ్యాట్ తో ఉండే పెరుగు లేదా యుగర్ట్ పిల్లలకు ఎంతో మేలు చేస్తుంది. మెదడు కణాల ఆరోగ్య వృద్ధికి సాయపడతాయి. పెరుగులోని పాలీఫెనాల్స్ రక్తప్రసరణను పెంచి చురుకుదనానికి తోడ్పడతాయి. 

ఆకుపచ్చని కూరగాయలు
ఆకుపచ్చని కూరగాయలకు ప్రాధాన్యం ఇవ్వాలని వైద్యులు తరచూ సూచిస్తూనే ఉంటారు. పాలకూర తదితర వాటిల్లో ఉండే ఫొలేట్, ఫ్లావనాయిడ్స్, కెరటోనాయిడ్స్, విటమిన్ ఈ, విటమిన్ కే1 పిల్లల్లో కాగ్నిటివ్ పనితీరును పెంచుతాయి. 

చేపలు
చేపల్లో విటమిన్ డీ, ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఉంటాయి. ఇవి మెదడులో కాగ్నిటివ్ పనితీరు బలహీనం కాకుండా కాపాడతాయి. 

నట్స్
నట్స్ లో విటమిన్ ఈ, జింక్, ఐరన్, ఫొలేట్, ప్రొటీన్ ఉంటాయి. పిల్లలతో రోజువారీ నట్స్ తినిపించాలి. దాంతో వారికి ముఖ్యమైన పోషకాలు అందుతాయి. నట్స్ తో మెదడు పనితీరు కూడా బలోపేతం అవుతుంది. ముఖ్యంగా కాగ్నిటివ్ పనితీరు పెరుగుతుంది. 

కమలాలు
కమలా, బత్తాయి జ్యూస్ ఇస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తాగుతారు. వాటి రుచి ప్రత్యేకం. వీటితో విటమిన్ సీ పుష్కలంగా లభిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి బలోపేతానికి, మెదడు పనితీరుకు సీ అవసరం.

More Telugu News