James Cameron: రామ్ చరణ్ పై జేమ్స్ కామెరాన్ ప్రశంసలు... చిరంజీవికి పుత్రోత్సాహం

James Cameron appreciates Ram Charan as Chirnajeevi feeling proud
  • ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్
  • ఉత్తమ గీతం కేటగిరీలో నాటు నాటు పాట
  • ఆర్ఆర్ఆర్ గురించి మరోసారి జేమ్స్ కామెరాన్ పొగడ్తల జల్లు
  • రామ్ చరణ్ ను ప్రత్యేకంగా ప్రస్తావించిన వైనం
ఆస్కార్ అవార్డుల వేడుక దగ్గరపడే కొద్దీ తెలుగు సినీ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ బరిలో ఉంది. అటు, హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కామెరాన్ ఆర్ఆర్ఆర్ పై మరోసారి తన అభిప్రాయాలను పంచుకున్నారు. 

ఈ క్రమంలో ఆయన హీరో రామ్ చరణ్ పై ప్రశంసల జల్లు కురిపించారు. ఇందులో రామ్ క్యారెక్టర్ ఎంతో సవాల్ తో కూడుకున్నదని పేర్కొన్నారు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. 

"జేమ్స్ కామెరాన్ సర్... మీ అంతటి గ్లోబల్ ఐకాన్, సినిమా మేధావి ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ ను పొగడడం ఆస్కార్ అవార్డు కంటే తక్కువేమీ కాదు. రామ్ చరణ్ కు ఇదొక గొప్ప గౌరవం. రామ్ చరణ్ ఈ స్థాయికి ఎదగడాన్ని ఓ తండ్రిగా గర్వంగా భావిస్తున్నా. మీ ప్రశంసలు రామ్ చరణ్ భవిష్యత్ ప్రాజెక్టులకు దీవెనలు" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. అంతేకాదు, జేమ్స్ కామెరాన్ వ్యాఖ్యల వీడియోను కూడా పంచుకున్నారు.
James Cameron
Ram Charan
Chiranjeevi
RRR
Oscars
Tollywood

More Telugu News