Xoom: జూమ్... హైటెక్ స్కూటర్ ను విడుదల చేసిన హీరో మోటోకార్ప్

Hero Motocorp launched Xoom High Tech Scooter in Telangana
  • హైదరాబాదులో లాంచింగ్ ఈవెంట్
  • 110 సీసీ కేటగిరీలో జూమ్ స్కూటర్
  • తొలిసారిగా కార్నర్ బెండింగ్ లైట్స్ ఏర్పాటు
  • ఆధునిక ఫీచర్లతో హైటెక్ స్కూటర్
  • మూడు వేరియంట్లలో లభ్యం
దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటాకార్ప్ తాజాగా జూమ్ హైటెక్ స్కూటర్ ను తెలంగాణలో విడుదల చేసింది. ఇది 110 సీసీ స్కూటర్. 

మరే స్కూటర్ కు లేని విధంగా దీంట్లో తొలిసారిగా కార్నర్ బెండింగ్ లైట్స్ అమర్చారు. మలుపులు తిరిగే సమయంలో ఒక్కోసారి వెలుతురు తక్కువగా ఉంటుంది. అయితే ఈ కార్నర్ బెండింగ్ లైట్లు ఎంతో ప్రకాశవంతమైన వెలుగును అందిస్తాయి. దాంతో రాత్రివేళల్లో సురక్షితంగా మలుపులు తిరిగేందుకు వీలుంటుంది. 

అంతేకాదు, 110 సీసీ సెగ్మెంట్లో మరే స్కూటర్ లకు లేనంత వెడల్పాటి టైర్లు జూమ్ సొంతం. ఇందులో బీఎస్-6 ప్రమాణాలతో కూడిన ఇంజిన్ ఏర్పాటు చేశారు. ఇందులో ఐ3ఎస్, డిజిటల్ స్పీడో మీటర్, బ్లూటూత్ కనెక్టివిటీ, సైడ్ స్టాండ్ ఇంజిన్ కటాఫ్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. 

హీరో జూమ్ స్కూటర్ షీట్ డ్రమ్, కాస్ట్ డ్రమ్, కాస్ట్ డిస్క్ వేరియంట్లలో వస్తోంది. షీట్ డ్రమ్-ఎల్ఎక్స్ వేరియంట్ ధర రూ.72,749, కాస్ట్ డ్రమ్-వీఎక్స్ ధర రూ.75,899, కాస్ట్ డిస్క్-జడ్ఎక్స్ ధర రూ.80,899 కాగా... ఇవన్నీ హైదరాబాదులో ఎక్స్ షోరూమ్ ధరలు. కొత్త మోడల్ కావడంతో ఇవి పరిచయ ధరలు మాత్రమే. తర్వాతి రోజుల్లో వీటి ధరలు పెరిగే అవకాశం ఉంది.
Xoom
High Tech Scooter
Hero Motocorp
Hyderabad

More Telugu News