Maha Sivaratri: మహా శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపనున్న ఏపీఎస్ ఆర్టీసీ

  • రేపు మహా శివరాత్రి
  • 3,800 స్పెషల్ బస్సులు నడపనున్న ఆర్టీసీ
  • ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీలే ఉంటాయన్న ఆర్టీసీ ఎండీ
  • ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులు
APSRTC organizes special buses in Maha Sivaratri festival

రేపు (ఫిబ్రవరి 18) మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాలకు ఏపీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడపనుంది. వివిధ శైవ క్షేత్రాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఆర్టీసీ 3,800 ప్రత్యేక బస్సులు నడపనుంది. కోటప్పకొండకు 675 శ్రీశైలం క్షేత్రానికి 650 ప్రత్యేక బస్సులు, కడప జిల్లా పొలతల క్షేత్రానికి 200, పట్టిసీమకు 100 బస్సులు నడపనున్నారు. 

ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీలే ఉంటాయని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. రాష్ట్రంలోని 101 శైవ క్షేత్రాలకు 25 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నట్టు వివరించారు. శైవ క్షేత్రాల వద్ద అన్ని సౌకర్యాలతో తాత్కాలిక బస్ స్టేషన్లు ఏర్పాటు చేస్టున్నట్టు తెలిపారు. 

ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులు తిప్పుతామని ఆర్టీసీ ఎండీ చెప్పారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని, ఘాట్ రోడ్లపై నైపుణ్యం కలిగిన డ్రైవర్లతో బస్సుల నిర్వహణ చేపడతామని స్పష్టం చేశారు.

More Telugu News