Lavaanya Tripathi: జీ 5 వెబ్ సిరీస్ గా 'పులి - మేక' .. చరణ్ చేతుల మీదుగా టీజర్ రిలీజ్!

Puli Meka Web series teaser released
  • లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రగా 'పులి - మేక'
  • సస్పెన్స్ తో కూడిన క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ 
  • కీలకమైన పాత్రను పోషించిన ఆది సాయికుమార్
  • ఉత్కంఠను రేకెత్తిస్తున్న టీజర్  
  • ఈ నెల 24వ తేదీ నుంచి జీ 5లో స్ట్రీమింగ్

సాధార‌ణంగా నేరాలు జ‌రిగిన‌ప్పుడు ప్ర‌జ‌లు పోలీసుల‌ను ఆశ్ర‌యిస్తుంటారు. ఆలాంటి పోలీసులనే ఓ హంత‌కుడు టార్గెట్ చేసి చంపుతుంటే పోలీసులు ఏం చేస్తారు? మృగంలాంటి వేషంతో ఓ వ్య‌క్తి వ‌రుస హ‌త్య‌ల‌ను ఎందుకు చేస్తూ వెళుతున్నాడు? అనే విష‌యాలు తెలియాలంటే జీ 5లో ఫిబ్ర‌వ‌రి 24న స్ట్రీమింగ్ కాబోతున్న‌ ‘పులి మేక’ ఒరిజిన‌ల్ చూడాల్సిందే.

ఇండియాలోనే వ‌న్ ఆఫ్ ది బెస్ట్ ఓటీటీల్లో ఒక‌టైన జీ 5 త‌మ ఆడియెన్స్ కోసం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ, మ‌రాఠీ, గుజ‌రాతీ, బెంగాలీ స‌హా ఇత‌ర భాష‌ల్లో వైవిధ్య‌మైన కంటెంట్‌ను అందిస్తోంది. ఈ ఓటీటీ లైబ్ర‌రీలో ఫిబ్ర‌వ‌రి 24న‌ మ‌రో బెస్ట్ ఒరిజిన‌ల్‌గా జాయిన్ కావ‌టానికి 'పులి - మేక' సిద్ధ‌మ‌వుతోంది. లావ‌ణ్య త్రిపాఠి, ఆది సాయి కుమార్‌, సిరి హ‌న్మంత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ  నెల 24న జీ 5లో స్ట్రీమింగ్‌ కానున్న ఈ స‌స్పెన్స్ థ్రిల్లర్ టీజ‌ర్‌ను శుక్ర‌వారం రామ్ చ‌ర‌ణ్ రిలీజ్ చేసి టీమ్‌కి అభినంద‌న‌లు తెలిపారు.

‘పులి మేక’ టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే .. మృగంలాంటి వేష‌ధార‌ణ‌తో ఉన్న వ్య‌క్తి, వ‌రుసగా పోలీసులను చంపేస్తుంటాడు. అస‌లు ఈ హ‌త్య‌ల‌ను ఎవ‌రు చేస్తున్నార‌నేది తెలియ‌క డిపార్ట్మెంట్ త‌ల‌ ప‌ట్టుకుంటుంది. ఈ కేసుని సాల్వ్ చేయ‌టానికి, హంత‌కుడిని ప‌ట్టుకోవ‌టానికి డిపార్ట్‌మెంట్ స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్‌ను ఏర్పాటు చేస్తుంది. దానికి హెడ్ కిర‌ణ్ ప్ర‌భ (లావ‌ణ్య త్రిపాఠి). అదే టీమ్‌లో ఫోరెన్సిక్ టీమ్ మెంబ‌ర్ గా ప్ర‌భాక‌ర్ శ‌ర్మ (ఆది సాయికుమార్) క‌నిపిస్తున్నారు. అస‌లు ఈ హంత‌కుడు ఎవ‌రు? ఎందుక‌లా పోలీసుల‌ను టార్గెట్ చేశాడనేది తెలియాలంటే ఫిబ్ర‌వ‌రి 24 వ‌ర‌కు ఆగాల్సిందే.

  • Loading...

More Telugu News