శ్రీకాళహస్తిలో లోకేశ్ పాదయాత్రపై అనిశ్చితి... వివరణ ఇచ్చిన తిరుపతి ఎస్పీ

  • టీడీపీ రూట్ మ్యాప్ కు అనుమతి నిరాకరించిన పోలీసులు
  • శివరాత్రి బ్రహ్మోత్సవాల దృష్ట్యా మాడవీధుల్లో పాదయాత్రకు అనుమతి నిరాకరణ
  • పోలీసుల మోహరింపు బ్రహ్మోత్సవాల బందోబస్తు కోసమేనన్న ఎస్పీ  
Tirupati SP talks about lokesh padayatra

నారా లోకేశ్ పాదయాత్రకు పోలీసులు అడుగడుగునా అడ్డుపడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తుండగా, తాము ఎలాంటి ఆంక్షలు విధించలేదని తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి అంటున్నారు. శ్రీకాళహస్తిలో లోకేశ్ పాదయాత్రపై అనిశ్చితి నెలకొంది. టీడీపీ నేతలు సూచించిన రూట్ మ్యాప్ కు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిపై ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి వివరణ ఇచ్చారు. 

శివరాత్రి బ్రహ్మోత్సవాల దృష్ట్యా శ్రీకాళహస్తి మాడవీధుల్లో పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదని వెల్లడించారు. శ్రీకాళహస్తిలో పోలీసుల మోహరింపు శివరాత్రి బ్రహ్మోత్సవాల బందోబస్తు కోసమేనని, లోకేశ్ పాదయాత్రను అడ్డుకోవడానికి కాదని స్పష్టం చేశారు. కాగా, తొట్టంబేడు మండలం లక్ష్మీపురం వద్ద లోకేశ్ పాదయాత్ర శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రవేశించింది.

More Telugu News