Samantha Ruth Prabhu: సమంతా జిమ్ కసరత్తులు మళ్లీ మొదలు.. 2023లో ఎలా ఉండాలో చెప్పిన నటి

Samantha Ruth Prabhu says 2023 is the year we get stronger
  • మళ్లీ తన పూర్వపు లైఫ్ స్టయిల్ ఆచరణ
  • మయోసైటిస్ సమస్య నుంచి కోలుకున్న నటి
  • మీరు కూడా ట్రై చేస్తారా? అంటూ ప్రశ్న
సమంతా రుతు ప్రభు తిరిగి తన కార్యక్షేత్రంలోకి అడుగుపెట్టినట్టుంది. పూర్వం మాదిరే జిమ్ లో భారీ వ్యాయామాలతో కసరత్తులు మొదలు పెట్టింది. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఆమె ఒక వీడియో విడుదల చేయగా.. తాజాగా మరో వీడియోని అభిమానులతో పంచుకుంది. మొదటి నుంచి సమంతాకి శారీరకంగా దృఢంగా ఉండడం అంటే ఎంతో ఇష్టం. ఆమె మానసికంగానూ బలవంతురాలేనని అభిమానులకు తెలిసిన విషయమే. 

కొన్ని నెలల క్రితం ఆమె మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది. దీనివల్ల కండరాల నొప్పులు వేధిస్తాయి. దీంతో వ్యాయామాలకు విరామం పలికి, చికిత్స తీసుకుంది. ప్రస్తుతం ఆ బాధల నుంచి కోలుకోవడంతో ఆమె తిరిగి తన కెరీర్ పై దృష్టి సారించింది. వరుస వెంట సినిమాలు చేయాల్సి రావడంతో శారీరక సామర్థ్యం కోసం వ్యాయామాలు చేస్తోంది. 

తన తాజా వర్కవుట్ వీడియోని ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది సమంత. ‘2023 సంవత్సరంలో మనం బలంగా మారాలి’ అంటూ క్యాప్షన్ పెట్టింది. ‘సరదాగా అనిపిస్తోంది. ఇది నిజం కాదనుకుంటున్నారా? మీరు కూడా దీన్ని ట్రై చేస్తారా?’ అని ప్రశ్నించింది. సమంత వీడియోని చూసిన ఓ యూజర్.. శామ్ నీకు మరింత శక్తి చేకూరాలంటూ కామెంట్ పెట్టాడు. గతంలో కంటే మరింత బలంగా తయారవ్వాలని మరో అభిమాని ఆకాంక్ష వ్యక్తం చేశాడు. (ఇన్ స్టా వీడియో కోసం)
Samantha Ruth Prabhu
Gym
workout
vedio

More Telugu News