sunda: ఉద్యోగులు రోజులో 2-4 గంటలు ఆ పని మీదే ఉండాలి.. సుందర్ పిచాయ్ ఆదేశం!

CEO Sundar Pichai asks staff to spend 2 to 4 hours a day testing chatbot

  • చాట్‌బాట్ ‘బార్డ్‌’ను మెరుగుపరిచేందుకు రంగంలోకి దిగిన గూగుల్ సీఈఓ పిచాయ్
  • రోజులో 2-4 గంటలు ‘బార్డ్‌’కు కేటాయించాలంటూ ఉద్యోగులకు ఆదేశాలు
  • బార్డ్‌కు మెరుగులు దిద్దేందుకు గూగుల్‌లో విస్తృత ప్రయత్నాలు

కృత్రిమ మేథ రంగంలో మైక్రోసాఫ్ట్‌పై పైచేయి సాధించేందుకు గూగుల్ తహతహలాడుతోంది. కృత్రిమే మేథ ఆధారిత చాట్‌బాట్ ‘బార్డ్‌’ను ఇటీవలే ప్రారంభించిన గూగుల్.. ఆదిలోనే కొన్ని అవాంతరాలను చవిచూడాల్సి వచ్చింది. వినియోగదారులు అడిగిన ప్రశ్నలకు బార్డ్ అసంబద్ధమైన సమాధానాలు ఇవ్వడంతో దాని సామర్థ్యంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో బార్డ్‌కు మరింతగా మెరుగులు దిద్దేందుకు గూగుల్ ఉద్యోగులు సహకరించాలంటూ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ తాజాగా ఆదేశాలు జారీ చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ఉద్యోగులు బార్డ్‌ను పలు కోణాల్లో పరీక్షిస్తున్నారు. తాము అడిగే ప్రశ్నలకు బార్డ్ ఇచ్చే సమాధానాలను విశ్లేషించి సంస్థకు నివేదికలు పంపుతున్నారు. అయితే.. బార్డ్‌‌కు మెరుగులు దిద్దే క్రతువుకు ఇకపై ఉద్యోగులందరూ రోజులో 2-4 గంటలు కేటాయించాలని గూగుల్ సీఈఓ పిచాయ్ ఆదేశించారట. 

సెర్చ్ ఇంజిన్ రంగంలో గూగుల్ అగ్రగామి. అయితే భవిష్యత్తు కృత్రిమ మేథదేనన్న తలంపుతో మైక్రోసాఫ్ట్... ఓపెన్ఏఐ అనే సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టింది. కృత్రిమ మేథ ఆధారిత చాట్‌బాట్ చాట్‌జీపీటీ రూపకల్పనలో ఓపెన్ఏఐకు అండగా నిలిచింది. ఈ చాట్‌బాట్‌ను తన సెర్చ్ ఇంజిన్‌కు అనుసంధానించి సెర్చ్ ఇంజిన్ మార్కెట్‌లో సింహభాగం చేజిక్కించుకోవాలని చూస్తోంది. ఇక చాట్‌జీపీటీ‌ పనితీరుకు యావత్ ప్రపంచం ఫిదా అయిపోవడంతో గూగుల్‌లో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే గూగుల్ తాను రూపొందించిన చాట్‌బాట్ బార్డ్‌ను ప్రారంభించింది. దీంతో.. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్, గూగుల్ మధ్య పోటీ పతాకస్థాయికి చేరుకుంది.

  • Loading...

More Telugu News