Syria: సిరియాను మళ్లీ వణికించిన భూకంపం

  • ఇప్పటికే సిరియా, టర్కీలను అతలాకుతలం చేసిన భూకంపాలు
  • నిన్న రాత్రి సిరియాలో మరో రెండు భూకంపాలు
  • నిద్రలేని రాత్రిని గడిపిన ప్రజలు
Two more earthquakes in syria

టర్కీ, సిరియాలను భారీ భూకంపం వణికించిన సంగతి తెలిసిందే. భూకంపం ధాటికి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. రెండు దేశాలకు కోలుకోనంత నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో సిరియాను మరోసారి భూకంపం వణించింది. నిన్న రాత్రి 10.47 గంటలకు 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం భూ ఉపరితలానికి 18.8 కిలోమీటర్ల లోతులో వచ్చిందని సిరియా జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది. భూకంప కేంద్రం ఇడ్లిబ్ నగరానికి 61 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపింది. 

ఆ తర్వాత రాత్రి 11.17 గంటలకు వాయవ్య తీర ప్రాంతంలోని లటాకియాలో 3.4 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఈ భూకంపం కేంద్రం లటాకియాకు 50 కిలోమీటర్ల దూరంలో భూ ఉపరితలానికి 46 కిలోమీటర్ల లోతులో సంభవించిందని అధికారులు తెలిపారు. ఈ భూకంపాలతో సిరియా ప్రజలు నిద్రలేని రాత్రులను గడిపారు. ప్రజలు ఇళ్లలో ఉండటానికి భయపడుతున్నారు. వీలైనంత ఎక్కువగా ఇళ్ల బయటే గడుపుతున్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కూడా హెచ్చరించింది.

More Telugu News