Nandamuri Tarakaratna: తారకరత్న ఆరోగ్యంపై తాజా అప్‌డేట్.. మెదడుకు కొనసాగుతున్న చికిత్స
- బెంగళూరులోని నారాయణ హృదయాలయలో కొనసాగుతున్న చికిత్స
- నిన్న ఎమ్మారై స్కానింగ్ చేసిన వైద్యులు
- ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడి
- నేడు హెల్త్ బులిటెన్ విడుదలయ్యే అవకాశం
బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్యంపై తాజా అప్‌డేట్ వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. నిన్న ఎమ్మారై స్కానింగ్ చేసినట్టు చెప్పారు.
ప్రస్తుతం తారకరత్న మెదడుకు సంబంధించిన వైద్య సేవలు కొనసాగుతున్నట్టు వివరించారు. ఆయనకు అందిస్తున్న వైద్య చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలతో నేడు హెల్త్ బులిటెన్ విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా, తారకరత్నకు చికిత్స కోసం విదేశీ వైద్యులను రప్పించినట్టు ఆయన కుటుంబ సభ్యుడు రామకృష్ణ ఇటీవల తెలిపారు.