Stock Market: అదానీ కంపెనీల జోరు.. స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • మార్కెట్లకు వరుసగా మూడో రోజు లాభాలు
  • 44 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 20 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు దూసుకుపోయాయి. బిలియనీర్ అదానీ గ్రూప్ కు చెందిన కంపెనీల షేర్లు ఈరోజు భారీగా పెరిగాయి. తమ బ్యాలెన్స్ షీట్ చాలా బాగుందని అదానీ గ్రూప్ ప్రకటించడంతో ఇన్వెస్టర్లలో ధీమా నెలకొంది. 

దీంతో ఉదయం మార్కెట్లు భారీగా పెరిగాయి. ఆ తర్వాత మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో క్రమంగా లాభాలు తగ్గుతూ వచ్చాయి. ట్రేడింగ్ ముగిసే చివరి క్షణంలో మార్కెట్లు నష్టాల్లోకి కూడా వెళ్లాయి. ఆ వెంటనే మళ్లీ కాస్త కోలుకుని లాభాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 44 పాయింట్లు లాభపడి 61,320కి చేరుకుంది. నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 18,036 వద్ద స్థిరపడింది.  

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (5.58%), నెస్లే ఇండియా (1.64%), టాటా స్టీల్ (1.50%), ఎన్టీపీసీ (1.06%), టీసీఎస్ (1.00%). 

టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-0.92%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.86%), యాక్సిస్ బ్యాంక్ (-0.78%), బజాజ్ ఫైనాన్స్ (-0.77%), టాటా మోటార్స్ (-0.55%).

More Telugu News