girls batting skills: ఈ అమ్మాయి బ్యాటింగ్.. ఆనంద్ మహీంద్రాను కూడా మెప్పించింది.. వీడియో ఇదిగో!

Sachin Tendulkar Anand Mahindra is mighty impressed with this girls batting skills
  • అద్భుతమైన గ్రేస్ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్
  • బ్యాటింగ్ ను ఎంజాయ్ చేస్తున్నానన్న సచిన్
  • అమ్మాయి తన ఆటను కొనసాగిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉందంటూ నెటిజన్ల ట్వీట్లు
ఓ అమ్మాయి బ్యాటింగ్ నైపుణ్యం.. మహామహులను మెప్పిస్తోంది. బాలిక ఆటను చూసి లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఆద్భుతం అంటూ ప్రశంసించారు. అమ్మాయి బ్యాటింగ్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. అందులో భారీ షాట్లు ఆడటం కనిపించింది.

ఈ మేరకు 35 సెకెన్ల పాటు ఉన్న వీడియోను ట్విట్టర్ లో ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ‘‘అద్భుతమైన గ్రేస్. మహిళా ఐపీఎల్ కు ధన్యవాదాలు. ప్రతిభకు అవకాశాలను అందించారు. నిజంగా ఉత్సాహకరంగా ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు. 

అంతకుముందు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా స్పందించారు. వీడియోను షేర్ చేసిన ఆయన.. ‘‘నిన్న ఐపీఎల్ వేలం జరిగింది. ఈ రోజు మ్యాచ్ కూడా మొదలైందా? అద్భుతం. నీ బ్యాటింగ్ ను చూసి ఎంజాయ్ చేస్తున్నా’’ అని ట్వీట్ చేశారు.  

మరోవైపు నెటిజన్లు అమ్మాయి బ్యాటింగ్ తీరుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆమెకు అద్భుత నైపుణ్యం ఉందని, ఆటను ఇలానే కొనసాగిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉందని ట్వీట్లు చేస్తున్నారు. 

ఇక వీడియోలో ఉన్న అమ్మాయి ఎవరు? ఎక్కడ ఉంటోంది? అనే విషయాలపై క్లారిటీ రాలేదు. అయితే అమ్మాయి పేరు ముమల్ మెహర్ అని, ఆమెది రాజస్థాన్ అని ఓ యూజర్ కామెంట్ చేశాడు.
girls batting skills
Sachin Tendulkar
Anand Mahindra
Cricket

More Telugu News