Suriya: సచిన్ ను కలుసుకున్న నటుడు సూర్య

Suriya meets Sachin Tendulkar in Mumbai says respect and love
  • ముంబైలో ఇరు సెలబ్రిటీల భేటీ
  • ఇటీవల తరచూ ముంబై వెళుతున్న సూర్య
  • హిందీలోకి ఎంట్రీ ఇస్తున్న తమిళ నటుడు
  • ముంబైకి మకాం మార్చిన జ్యోతిక, పిల్లలు
ప్రముఖ దక్షిణాది నటుడు సూర్య ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ ఒకే చోట చేరి ముచ్చటించుకుంటే? అదే జరిగింది. తమ భేటీకి సంబంధించిన ఫొటోను నటుడు సూర్య ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు. తాము ఎక్కడ కలుసుకున్నదీ సూర్య వెల్లడించలేదు. కాకపోతే వీరి భేటీ ముంబైలోనే జరిగి ఉంటుందని అనుకోవచ్చు. 

ఎందుకంటే సూర్య ఇటీవల తరచూ ముంబై, చెన్నై మధ్య వస్తూ, పోతున్నాడు. సూర్య భార్య జ్యోతిక, పిల్లలు ముంబైకి మారిపోయారు. ‘సచిన్ టెండుల్కర్ అంటే గౌరవం, ప్రేమ!!’ అని సూర్య క్యాప్షన్ పెట్టాడు. దీనికి అభిమానులు హార్ట్ ఎమోజీలతో పెద్ద ఎత్తున స్పందించారు. 

వీరిద్దరికీ అభిమానుల ఫాలోయింగ్ ఎక్కువ. వీరి భేటీ అభిమానులకు మంచి సంతోషాన్నిచ్చిందనడంలో సందేహం లేదు. సూర్య ఇప్పుడు బాలీవుడ్ రంగ ప్రవేశానికి రెడీ అవుతుండడం తెలిసిందే. అంతేకాదు, తన చిత్ర నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్ టైన్ మెంట్ ద్వారా హిందీ రీమేక్ గా సూరారి పొట్రు చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. 
Suriya
Sachin Tendulkar
meet
mumbai

More Telugu News