Road Accident: చౌటుప్పల్ లో రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

Four people lost their lives in a collision between an auto and a private bus in Choutuppal
  • ఆటోను ఢీ కొట్టిన ప్రైవేటు బస్సు
  • నలుగురు మహిళా కూలీలు మృతి
  • ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ జాం
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ప్రైవేటు బస్సు ఒకటి ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మహిళలు చనిపోయారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. యాక్సిడెంట్ విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే పనుల్లో నిమగ్నం కాగా, బాధితులకు 108 సిబ్బంది సేవలందించారు. ప్రాథమిక చికిత్స చేసి ఆసుపత్రికి తీసుకెళ్లారు.

దండుమల్కాపురం ఇండస్ట్రియల్ పార్కు దగ్గర్లో ఆటో బస్సు ఢీ కొన్నాయని పోలీసులు తెలిపారు. దేవలమ్మ నాగారం నుంచి వస్తున్న ఆటోను అబ్దుల్లాపూర్ మెట్ వెళ్తున్న బస్సు ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మహిళా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన చికిత్స కోసం వారిని హైదరాబాద్ కు తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయారని అధికారులు చెప్పారు. చనిపోయిన వారిని డాకోజి నాగలక్ష్మి, వరకాంతం అనసూయ, సిలివేరు దనలక్ష్మి, దేవరపల్లి శిరీషలుగా గుర్తించినట్లు వెల్లడించారు.
Road Accident
choutuppal
Telangana
women death
auto bus

More Telugu News