Tollywood: ఎన్టీఆర్​తో భారీ పౌరాణిక చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్!

Trivikram and Jr NTR come up with A Mythological Film
  • అరవింద సమేతతో భారీ హిట్ సొంతం చేసుకున్న తారక్, త్రివిక్రమ్
  • ఈ ఇద్దరి కాంబినేషన్ లో మరో చిత్రానికి సన్నాహకాలు
  • ప్యాన్ ఇండియా స్థాయిలో పౌరాణిక చిత్రం వస్తుందంటున్న నిర్మాత నాగవంశీ
తెలుగు చిత్ర పరిశ్రమలోని స్టార్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ ఒకరు. తన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్స్ అందించారు. అయితే త్రివిక్రమ్ ఇంతవరకూ టచ్ చేయని జానర్లలో పౌరాణికం ఒకటి. ఇప్పుడు ఈ జానర్‌లో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ తరం కథనాయకుల్లో పౌరాణిక పాత్రలను చేయగలిగే సత్తా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలని చూస్తున్నారు. త్రివిక్రమ్ త్వరలో జూనియర్ ఎన్టీఆర్‌తో చిత్రం చేయనున్నట్టు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. 

వంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌తో భారీ బడ్జెట్‌తో పౌరాణిక చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ప్యాన్ ఇండియా పరంగా కూడా దీనిని విడుదల చేస్తామని ఆయన తెలిపారు. త్రివిక్రమ్, ఎన్టీఆర్ ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్‌లు పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 

కాగా, ‘అరవింద సమేత’ చిత్రంతో ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఇప్పటికే భారీ హిట్ సొంతం చేసుకున్నారు. మరోసారి ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రావాల్సి ఉంది. కానీ అది వాయిదా పడుతూ వస్తోంది. అనుకోని కారణాలతో అది క్యాన్సిల్ అయింది. అయితే త్వరలోనే ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తే, అది పౌరాణిక చిత్రం అయితే అభిమానులను అలరించడం ఖాయం.
Tollywood
Trivikram Srinivas
Junior NTR
Mythological

More Telugu News