Santhosh Sobhan: మెగాస్టార్ పట్ల అభిమానమే ఇక్కడి వరకూ తీసుకొచ్చింది: 'శ్రీదేవి శోభన్ బాబు' డైరెక్టర్

Sridevi Sobhan Babu pre release event
  • నిర్మాతగా సుస్మిత కొణిదెల ఫస్టు మూవీ 
  • ఈ నెల 18న వస్తున్న 'శ్రీదేవి శోభన్ బాబు 
  • డైరెక్టర్ గా ప్రశాంత్ కుమార్ దిమ్మల పరిచయం 
  • మెగాస్టార్ పలకరింపే కొండంత బలమని వ్యాఖ్య  

సంతోష్ శోభన్ - గౌరీ కిషన్ జంటగా 'శ్రీదేవి - శోభన్ బాబు' సినిమా రూపొందింది. సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ సినిమాకి, ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించాడు. ఈ నెల 18వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాదు .. బంజారా హిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్లో నిర్వహించారు. 

ఈ వేదికపై డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ దిమ్మల మాట్లాడుతూ .. నేను తొమ్మిదో తరగతి చదువుతున్న దగ్గర నుంచి నాకు చిరంజీవి గారు అంటే ఇష్టం. ఆయన సినిమాలను వదలకుండా చూసేవాడిని. ఆయనను చూస్తే చాలు అనుకున్నాను. ఆయన స్ఫూర్తితోనే ఇండస్ట్రీకి వచ్చాను" అన్నాడు. 

" ఒకరోజున సుస్మితగారు తారసపడటంతో అక్కా అంటూ ఆమెను పరిచయం చేసుకుని, నా ప్రయత్నాలను గురించి చెప్పాను. చిరంజీవిగారికి కథ చెప్పడం కోసం ఆమె కాల్ చేస్తే వెళ్లాను. చిరంజీవిగారు ఆత్మీయంగా పలకరించారు. ఆ క్షణాలను నేను ఎప్పటికీ మరిచిపోలేను. విలేజ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని నమ్ముతున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు. 

  • Loading...

More Telugu News