Gautam Adani: అదానీకి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో నిరసనలు

Protest against Adani group in Australia
  • ఆస్ట్రేలియాలో కోల్ మైన్స్ నిర్వహిస్తున్న అదానీ గ్రూప్
  • ఆ సంస్థకు వ్యతిరేకంగా గతంలోనే నిరసనలు
  • లోన్లు ఇవ్వొద్దంటూ బ్యాంకుల ముందు ధర్నాలు

ప్రముఖ వ్యాపారవేత్త అదానీకి ఇబ్బందులు పెరుగుతున్నాయి. అదానీ గ్రూప్ వ్యాపారాలపై వస్తున్న వార్తలతో ఆ సంస్థ పరపతి దెబ్బతింటోంది. మరోవైపు ఆస్ట్రేలియాలో సైతం అదానీకి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అదానీ ప్రాజెక్టులకు రుణాలు ఇవ్వొద్దని బ్యాంకుల ముందు ఆ దేశ ప్రజలు ధర్నాలు చేశారు. స్టాప్ ఫండింగ్ అదానీ కోల్, స్టాప్ అదానీ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ లో అదానీ సంస్థ కార్మెకెల్ బొగ్గు గనిని నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఇప్పుడు ఆ సంస్థకు లోన్లు ఇవ్వొద్దంటూ ధర్నాకు దిగాయి.

  • Loading...

More Telugu News