Team India: రెండోసారి పెళ్లి వేడుకలో సినిమా స్టయిల్లో డ్యాన్స్ చేసిన పాండ్యా దంపతులు.. వీడియో ఇదిగో!

Hardik Pandya Natasa Stankovic dance down the aisle in beautiful Christian wedding in Udaipur
  • తన భార్య నటాషాను మరోసారి పెళ్లి చేసుకున్న హార్దిక్
  • ఉదయ్ పూర్ కోటలో అంగరంగ వైభవంగా వేడుక
  • హాజరైన కుటుంబ సభ్యులు, సన్నిహితులు
టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్ ను మరోసారి పెళ్లి చేసుకున్నాడు. కొన్నేళ్ల సహజీవనం తర్వాత 2020లోనే వీరు ఒక్కటయ్యారు. కానీ, అప్పుడు లాక్ డౌన్ కావడంతో ఇంట్లోనే సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. వీరికి అగస్త్య అనే బాబు కూడా ఉన్నాడు. అయితే, ప్రేమికుల దినోత్సవం రోజు థీమ్ మ్యారేజ్ చేసుకోవాలని ఈ ఇద్దరూ అనుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కోటలో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం నటాషాను పాండ్యా పెళ్లి చేసుకున్నాడు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, పలువురు క్రికెటర్లు కూడా హాజరయ్యారు. 

పెళ్లి వేడుకలో దంపతులిద్దరూ చాలా హుషారుగా కనిపించారు. పెళ్లి మండపానికి ఇద్దరూ సినిమా స్టయిల్లో డ్యాన్ చేస్తూ వచ్చారు. సాయంత్రం పూట పూల బొకేలు పట్టుకొని పలువురు మహిళలు వెంటరాగా.. తెల్లటి మ్యాట్ పై ఇద్దరూ ముందుకు సాగారు. పాండ్యా అదిరిపోయే స్టెప్పులు వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Team India
hardik pandya
Natasa Stankovic
marriage
Udaipur
dance

More Telugu News