తిరుమలలో సర్వదర్శనం భక్తులకు 24 గంటల సమయం

Tirumala information for pilgrims
  • తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
  • 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు
  • నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 70,789
  • నిన్న హుండీ ద్వారా రూ.4.13 కోట్ల ఆదాయం 
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి భక్తులు 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. మరోపక్క, నిన్న తిరుమల శ్రీవారిని 70,789 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,215 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ద్వారా రూ.4.13 కోట్ల ఆదాయం లభించింది.
Go Back to Shorts
Tirumala
Pilgrims
Devotees
Darshan
TTD

More Telugu News