మీ కోరిక మేరకు మిమ్మల్ని జబర్దస్త్ ఆంటీ అని పిలుస్తా: లోకేశ్

 • నగరి నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర
 • నగరిలో టీడీపీ సభ
 • డైమండ్ పాప ఫీలైందంటూ లోకేశ్ వ్యాఖ్యలు
 • మంత్రి రోజాను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు
Lokesh take a swipe at minister Roja in Nagari

టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. పాదయాత్ర ఈ సాయంత్రం నగరి పట్టణానికి చేరుకోగా, అక్కడ ఏర్పాటు చేసిన సభలో లోకేశ్ ప్రసంగించారు. గత ఎన్నికల్లో మనం నగరిలో గెలవలేకపోయామని, జబర్దస్త్ ఆంటీ గెలిచిందని పరోక్షంగా మంత్రి రోజాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

ఈసారి ఎన్నికల్లో ఆ చరిత్రను తిరగరాయాలని పిలుపునిచ్చారు. మళ్లీ మనం నగరిలో గెలవాలంటే కలసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని టీడీపీ కార్యకర్తలకు స్పష్టం చేశారు. "టీడీపీ గెలుపు కోసం ఊరూరా తిరగండి... కష్టపడండి. ఇక్కడో కుర్రాడు భాను ఉన్నాడు... కష్టపడి పనిచేస్తాడు. అతడిని దీవించండి. మంచి మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించండి" అని పేర్కొన్నారు.

లోకేశ్ ప్రసంగం హైలైట్స్...

 • ఈ పాదయాత్ర దెబ్బకి వైసీపీ అంతిమయాత్ర మొదలైంది. ఈ పాదయాత్ర దెబ్బకి జగన్ మోహన్ రెడ్డి లండన్ మందులు పనిచేయడంలేదు.
 • ఈ జగన్ ఎంత పిరికివాడంటే... ఈ లోకేశ్ ను ఆపేందుకు 1000 మంది పోలీసులు, 20 మంది ఎస్సైలు, 10 మంది సీఐలు, ఆరుగురు డీఎస్పీలు... నేను ఎక్కడ నడిస్తే అక్కడ 30 పోలీసు వాహనాలు ముందు వెళతాయి.
 • పోలీసు సోదరులకు ఒకటే చెబుతున్నా... నా పేరు లోకేశ్... నేను నక్సలైట్ కాదు.
 • నేను ఎక్కడికి వెళ్లినా ఒక డ్రోన్ ఎగరేస్తారు. అమరావతిలో రఘురామిరెడ్డి అనే ఒక ఐపీఎస్, జగన్ కూర్చుని లోకేశ్ పాదయాత్రకు ఎంతమంది వచ్చారు, లోకేశ్ ఏం మాట్లాడాడు అని గడగడ వణికిపోతూ చూస్తుంటారు.
 • జగన్ కు చెప్పేదేంటంటే... అయ్యా నువ్వు నా సౌండ్ వెహికిల్ లాక్కున్నావ్... తగ్గేదే లేదు... నా మైక్ వెహికిల్ లాక్కున్నావ్... తగ్గేదే లేదు... నా స్టూలు కూడా లాక్కున్నావ్... అయినా తగ్గేదే లేదు.
 • ఈ 3 సంవత్సరాల 8 నెలల్లో జగన్ ఏం పీకాడని తల గోక్కున్నా. ఇప్పుడు అర్థమైంది జగన్ ఏం పీకాడో!... నా మైక్ పీకాడు!
 • అయ్యా జగన్ రెడ్డీ... నువ్వు టెన్త్ ఫెయిల్. నీకే అంత తెలివి ఉంటే స్టాన్ ఫోర్డ్ లో చదివిన నాకు ఎంత తెలివి ఉంటుందో ఆలోచించుకో.
 • జగన్ రెడ్డీ... నువ్వు కేవలం నా మైక్ లాక్కున్నావ్ బ్రదర్... నా గొంతు కాదు.
 • అన్న విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారకరామారావు ఇచ్చిన గొంతు ఇది.
 • జగన్ కు ఓ బంపర్ ఆఫర్ ఇస్తున్నా. నేను 400 రోజులు పాదయాత్ర చేస్తున్నా. పెట్టుకో నాపైన 400 కేసులు. నీ ఎఫ్ఐఆర్ లు చూసి లోకేశ్ భయపడడు.
 • జనం కోసం మాట్లాడబోతే 20 కేసులు పెట్టారు. ఇది న్యాయమేనా?
 • గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్, షర్మిల పాదయాత్ర చేశారు... ఏనాడైనా వారి మైక్ లాక్కున్నారా?
 • లక్ష కోట్లు దొబ్బి తిని జైలుకు వెళ్లిన జగన్ కు నో రూల్స్. ఆయన పాదయాత్రలో 9 మంది చనిపోతే నో రూల్స్. ఆనాడు చంద్రబాబును అడుగడుగునా తిడితే నో రూల్స్. కానీ ఈరోజు నేను యువత తరఫున పాదయాత్ర చేస్తుంటే జీవో నెం.1 తీసుకువచ్చాడు.
 • అందుకే నేను చెబుతున్నా... ఏ1 నీ జీవో నెం.1ని మడిచి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో పో. లోకేశ్ మాత్రం ఆగడు. ఈ లోకేశ్ ది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం.
 • రఘురామిరెడ్డిని అడుగుతున్నా... నా మీద డ్రోన్ ఎగరేసి నువ్వు పీకేదేంటయ్యా!
 • పోలీసు అధికారులకు ఈ జగన్ చెల్లింపులు పెండింగ్ పెట్టాడు. వాటిని పరిష్కరించాలని పోలీసులు నాతో గోడు వెళ్లబోసుకుంటున్నారు.
 • అన్న ఎన్టీఆర్ మనందరికీ దేవుడు... చంద్రబాబు రాముడు.... కానీ నేను అలాకాదు... నేను మూర్ఖుడ్ని... వైసీపీ వాళ్లు ఈ విషయం గ్రహిస్తే బాగుంటుంది. 
 • ఈ జగన్ ఒక సైకో. జిల్లాకు ఒక సైకోను తయారుచేశాడు. మన చిత్తూరు జిల్లాలో ఉన్న సైకో పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 
 • ఇక్కడే అవినీతి జరిగినా, ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగినా, ఇసుక మాఫియా జరిగినా దాని కేరాఫ్ అడ్రెస్ ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
 • ఆ పెద్దిరెడ్డికి పోటాపోటీగా నగరి ఎమ్మెల్యే... డైమండ్ పాప! లోకేశ్ నన్ను పాపా అంటాడా అని మొన్న బాగా ఫీలైందంట!
 • అమ్మా క్షమించండి... మీ కోరిక మేరకు మిమ్మల్ని జబర్దస్త్ ఆంటీ అని పిలుస్తా.
 • ఒక మహిళా మంత్రి అయిన ఈ జబర్దస్త్ ఆంటీ డైరెక్షన్ లో గ్రావెల్ ను యమాస్పీడుగా తవ్వేస్తున్నారు. రోజుకు 150 టిప్పర్లు తమిళనాడుకు వెళుతున్నాయి. 
 • వడమాలపేట మండలం కాయం రెవెన్యూ పరిధిలో పేదల పట్టాభూముల్లో కూడా ఈ జబర్దస్త్ ఆంటీ తవ్వకాలు జరుపుతోంది.
 • వడమాలపేట మండలం పాదిరేడులో టీటీడీ ఉద్యోగులకు 400 ఎకరాలు సేకరించి ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అక్కడ దళితుల భూములు ఉన్నాయి. మీకు రూ.20 లక్షలు ఇస్తాను... దాంట్లో నాకు 20 శాతం ఇవ్వండి అని ఈ జబర్దస్త్ ఆంటీ అడిగింది.
 • ఆమె ఎప్పుడైతే ఎమ్మెల్యే అయిందో గ్రానైట్ కంపెనీలకు, క్వారీలకు ఫోన్ చేసింది. ఆమె దెబ్బకు తట్టుకోలేక వారు పరారయ్యారు.
 • నగరి నియోజకవర్గాన్ని కేకు ముక్కల్లా కోసి కుటుంబ సభ్యులకు, సొంత బంధువులకు పంచిపెట్టింది.
 • అన్న రాంప్రసాద్ రెడ్డికి వడమాలపేట, నిండ్ర, పుత్తూరులను ఇచ్చేసింది... విజయపురం మండలాన్ని కుమారస్వామికి, నగరి మండలాన్ని భర్త సెల్వమణి తమ్ముడికి పంచిపెట్టింది.
 • ఆ లెక్కన నగరికి ఒక్క ఎమ్మెల్యే కాదు ఐదుగురు ఎమ్మెల్యేలు. వీరందరూ రాత్రి జబర్దస్త్ ఆంటీతో కూర్చుని తాము దోచుకున్న సొమ్ము లెక్కలేసుకుంటారు. 
 • కొసలనగరంలో 35 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈ జబర్దస్త్ ఆంటీ కబ్జా చేసింది. వడమాలపేట టోల్ గేటు వద్ద 55 ఎకరాల ప్రభుత్వ భూమి గోవిందా గోవింద...!
 • జబర్దస్త్ ఆంటీ ఇక్కడే కాదు వైజాగ్ లో రుషికొండ వద్ద కూడా ఒక ఎకరం గోవిందా గోవింద...!
 • అమ్మా...  ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయ్ వెళ్లడం మీకు బాగా ఇష్టం. అదే ధ్యాసను మీరు ఇక్కడున్న చేనేతలపై ఎందుకు పెట్టడంలేదు?
 • 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని జబర్దస్త్ ఆంటీ నాయకుడు జగన్ రెడ్డి చెప్పాడు. ఏమైంది ఆ 300 యూనిట్ల విద్యుత్?.. గోవిందా గోవింద...!

More Telugu News