Hardik Pandya: భార్యను మరోసారి పెళ్లి చేసుకోబోతున్న టీమిండియా ఆల్ రౌండర్

Team India cricketer Hardik Pandya set to tie the knot his wife for the second time
  • మరోసారి పెళ్లి చేసుకోవాలని హార్దిక్ పాండ్యా నిర్ణయం
  • కరోనా లాక్ డౌన్ వేళ నటాషా స్టాంకోవిచ్ ను పెళ్లాడిన హార్దిక్
  • ప్రేయసితో రిజిస్టర్ మ్యారేజి
  • ఈసారి సంప్రదాయబద్ధంగా పెళ్లి
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్యను మరోసారి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అందుకు రేపే (ఫిబ్రవరి 14) ముహూర్తం అని తెలుస్తోంది. సెర్బియాకు చెందిన నటాషా స్టాంకోవిచ్ ను హార్దిక్ పాండ్యా ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 

నటాషా బాలీవుడ్ నటి. చాలాకాలంగా ప్రేమలో ఉన్న హార్దిక్ పాండ్యా, నటాషా కరోనా లాక్ డౌన్ సమయంలో రిజిస్టర్ మ్యారేజితో ఒక్కటయ్యారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. 

అయితే, కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకోవాలని హార్దిక్, నటాషా నిర్ణయించుకున్నారు. నేటి నుంచి 16వ తేదీ వరకు వీరి పెళ్లి వేడుకలు జరగనున్నాయి. ఈ సెలెబ్రిటీ మ్యారేజికి రాజస్థాన్ లోని ప్రఖ్యాత పర్యాటక స్థలం ఉదయపూర్ వేదికగా నిలవనుంది. హల్దీ, మెహెందీ, సంగీత్ వేడుకలతో తమ పెళ్లిని సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని హార్దిక్ కోరుకుంటున్నాడు.
Hardik Pandya
Natasha
Wedding
Wife
Team India
Bollywood

More Telugu News