Jayamangala Venkata Ramana: వైసీపీలో చేరిన టీడీపీ నేత జయమంగళ వెంకటరమణ.. ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు జగన్ హామీ

TDP leader joins YSRCP
  • టీడీపీకి గుడ్ బై చెప్పిన కైకలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకటరమణ
  • వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్
  • నలుగురు గన్ మెన్లను కేటాయించిన ప్రభుత్వం

తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే, కైకలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయమంగళ వెంకటరమణ వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి ఆయనకు వైసీపీలోకి జగన్ స్వాగతం పలికారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మధ్యవర్తిత్వంతో ఆయన వైసీపీలో చేరారు. మరోవైపు వెంకటరమణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు జగన్ హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల్లో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక సీట్ ను వెంకటరమణకు జగన్ కేటాయించారు. అంతేకాదు, ఆయనకు నలుగురు గన్ మెన్లను ప్రభుత్వం కేటాయించింది.

  • Loading...

More Telugu News