అదానీ అంశంపై ఆర్థిక మంత్రికి సెబీ నివేదిక
- ఈ 15న ఆర్థిక మంత్రి సీతారామన్ తో సెబీ అధికారుల భేటీ
- అదానీ గ్రూపు కంపెనీలపై సమాచారంతో నివేదిక
- తాము తీసుకున్న చర్యల వివరాల ప్రస్తావన
హిండెన్ బర్గ్ ఆరోపణలతో అదానీ షేర్లు పడిపోవడం తెలిసిందే. దీంతో అదానీ ఎంటర్ ప్రైజెస్ ఎఫ్ పీవోని విరమించుకుంది. దీని పూర్వాపరాలపై సెబీ సమాచారం ఇవ్వనున్నట్టు తెలిసింది. ఈ నెల 15న సెబీ ఉన్నతాధికారుల బృందం ఆర్థిక మంత్రితో భేటీ కానుంది. ఇటీవల అదానీ గ్రూప్ షేర్ల పతనం సమయంలో తీసుకున్న అదనపు నిఘా చర్యల గురించి వివరించనున్నట్టు ఈ వ్యవహారం గురించి తెలిసిన వర్గాలు వెల్లడించాయి. అలాగే, విదేశాల్లో ఉన్న అదానీ గ్రూప్ ఆఫ్ షోర్ కంపెనీల నుంచి అదానీ గ్రూప్ సంస్థల్లోకి వచ్చిన నిధుల అంశంపైనా సెబీ వివరాలు సమర్పించనున్నట్టు తెలిపాయి.