Kiran Abbavaram: కిరణ్ చాలా అదృష్టవంతుడు: 'వినరో భాగ్యము విష్ణుకథ' ఈవెంటులో బన్నీవాసు

  • గీతా ఆర్ట్స్ నుంచి 'వినరో భాగ్యము విష్ణు కథ'
  • తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ 
  • తనకి స్వామి ఆశీస్సులు ఉన్నాయన్న బన్నీవాసు
  • ఈ నెల 18వ తేదీన సినిమా విడుదల    

Vinaro Bhagyamu Vishnu katha pre release event

కిరణ్ అబ్బవరం హీరోగా 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా రూపొందింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించాడు. కిరణ్ అబ్బవరం జోడీగా కశ్మీర పరదేశి నటించిన ఈ సినిమాకి, చైతన్య భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చాడు. మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమాను ఈ నెల 18వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును 'తిరుపతి'లో నిర్వహించారు. 

ఈ వేదికపై బన్నీవాసు మాట్లాడుతూ .. "నేను తిరుపతి వచ్చినప్పుడల్లా నాకు మంచి భవిష్యత్తును ఇవ్వు స్వామి అని కోరుకునేవాడిని. కానీ ఇంత మంచి భవిష్యత్తు ఇస్తాడని నేను అనుకోలేదు. ఈ రోజున ఆయన పాదాల దగ్గర నిలబడి మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు ఇండస్ట్రీలో మా 'పాలకొల్లు'వారే ఎక్కువగా ఉండేవారు. ఈ మధ్య 'తిరుపతి' వాళ్లు డామినేట్ చేసేస్తున్నారు " అని అన్నాడు. 

"ఈ సినిమా డైరెక్టర్ కిశోర్ అబ్బూరు తిరుపతి కుర్రాడే. హీరో కిరణ్ అబ్బవరం ఇక్కడే చదువుకున్నాడు. తాను తిరిగిన ఏరియాలో హీరోగా ఇంత పెద్ద సినిమా ఫంక్షన్ జరుపుకుంటున్న ఆయన నిజంగానే అదృష్టవంతుడు. ఈ సినిమా కిరణ్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లడమే కాదు, గీతా ఆర్ట్స్ 2కి మరింత గౌరవం తీసుకుని వస్తుంది" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News