అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు డీసీజీఐ నోటీసులు
- లైసెన్స్ లేకుండా ఔషధాల అమ్మకాలు
- మొత్తం 20 సంస్థలకు నోటీసులు
- రెండ్రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు
కోర్టు ఉత్తర్వులను 2019 మే, నవంబరు మాసాల్లో అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపించడం జరిగిందని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 2020 ఫిబ్రవరిలోనూ మరోసారి ఆ ఉత్తర్వులను పంపించినట్టు వివరించారు.
లైసెన్స్ లేని అమ్మకాలపై నిషేధం ఉన్నప్పటికీ సదరు సంస్థలు ఆన్ లైన్ అమ్మకాలు సాగిస్తున్నట్టు గుర్తించామని డీసీజీఐ వెల్లడించింది. రెండ్రోజుల్లో నోటీసులపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.