EMRI: 108 లో డ్రైవర్ సహా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

  • అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన ఈఎంఆర్ఐ
  • డ్రైవర్ ఉద్యోగాలకు పదో తరగతి పాస్ అయితే చాలు..
  • ఎల్ఎంవీ (బ్యాడ్జ్) తప్పనిసరి అంటున్న అధికారులు
EMRI Invites applications for various posts in Siddipet Telangana

ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్స్టిట్యూట్ (ఈఎంఆర్ఐ) 108లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. సిద్దిపేట జిల్లా పరిధిలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ), డ్రైవర్ (పైలెట్), ఎమర్జెన్సీ రెస్సాన్స్ ఆఫీసర్ (ఈఆర్ఓ) పోస్టులు ఖాళీగా ఉన్నాయని జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ సలీం ఓ ప్రకటనలో తెలిపారు.

అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు..
ఈఎంటీ పోస్టులకు బీఎస్సీ (బీజెడ్సీ), బీఎస్సీ (నర్సింగ్), జీఎన్ఎం, బీ ఫార్మసీ, డీ ఫార్మసీ, డీఎంఎల్ టీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 30 ఏళ్లకు మించకూడదు. పైలెట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి పాస్ సర్టిపికెట్ తో పాటు లైట్ మోటార్ వెహికల్ బ్యాడ్జి కలిగి ఉండాలని షేక్ సలీం చెప్పారు. వయసు 23 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలని వివరించారు. ఇక ఈఆర్ఓ పోస్టుకు ఇంటర్ లేదా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు బేసిక్ కంప్యూటర్ పరిజ్జానం కలిగి ఉన్న అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు.

ఉద్యోగం చేయాల్సిన ప్రదేశం..
ఈఆర్ఓ పోస్టులకు ఎంపికైన వారు హైదరాబాద్ లో, మిగిలిన వారు సిద్దిపేట జిల్లా పరిధిలో పనిచేయాల్సి ఉంటుంది.

ఇంటర్వ్యూ జరిగే ప్రాంతం..
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ సెట్ తో ఈ నెల 13 (సోమవారం) నాడు సిద్ధిపేట బురుజు వద్ద గల ఓల్ట్ ఎంసీహెచ్ స్వచ్చబడి మీటింగ్ హాల్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటర్వ్యూ కు హాజరుకావాలి.

పూర్తి వివరాలకు..
అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే 7330967634 నెంబర్ లో సంప్రదించవచ్చు.

More Telugu News