Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం: ఈడీ రిమాండ్ రిపోర్టులో కవిత, కేజ్రీవాల్ పేర్లు!

  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో చురుగ్గా ఈడీ దర్యాప్తు
  • నేడు మాగుంట రాఘవరెడ్డి అరెస్ట్
  • 10 రోజుల ఈడీ కస్టడీ
  • ఈడీ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
ED remand report in Delhi Liquor Scam

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవను ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అరెస్ట్ చేయడం తెలిసిందే. రాఘవను నేడు కోర్టులో హాజరుపర్చగా, 10 రోజుల కస్టడీ విధించారు. 

కాగా, ఈ స్కాంలో మాగుంట రాఘవ ప్రమేయాన్ని రిమాండ్ రిపోర్టులో ఈడీ వివరించింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మాగుంట రాఘవ కీలక భాగస్వామి అని స్పష్టం చేసింది. రూ.180 కోట్ల నేరపూరిత ఆర్థిక లావాదేవీల్లో రాఘవ ప్రమేయం ఉందని వెల్లడించింది. హోల్ సేల్ కంపెనీ ఇండోస్పిరిట్ లో రాఘవ పార్టనర్ అని తెలిపింది. మాగుంట ఆగ్రో ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రెండు రిటైల్ జోన్స్ ఉన్నాయని వివరించింది. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు సౌత్ గ్రూప్ రూ.100 కోట్లు ఇచ్చిందని ఈడీ పేర్కొంది. కొన్ని పార్టీల్లోని పెద్ద నాయకులు బినామీల ద్వారా ఈ స్కాంలో పాలుపంచుకున్నారని స్పష్టం చేసింది. సౌత్ గ్రూప్ లో కవిత, మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవ, శరత్ చంద్రారెడ్డి ఉన్నట్టు వెల్లడించింది. 

ఇండోస్పిరిట్ సంస్థలో కవిత ప్రతినిధిగా అరుణ్ పిళ్లై వ్యవహరించాడని, అరుణ్ పిళ్లైని విచారించిన సమయంలో మాగుంటకు సంబంధించిన విషయాలు వెల్లడయ్యాయని పేర్కొంది. కేజ్రీవాల్ ను మాగుంట శ్రీనివాసులురెడ్డి కలిసినట్టు అరుణ్ పిళ్లై వాంగ్మూలం ఇచ్చాడని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ స్పష్టం చేసింది.

More Telugu News